కోట కలిదిండిలో అమ్మవారిని దర్శించుకున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్
చిత్రం న్యూస్, కైకలూరు: శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కలిదిండి మండలం కోట కలిదిండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కోరుకొల్లు DC చైర్మన్ పేటేటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన 7వ రోజు సరస్వతి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నానన్నారు. ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

