గోదావరి నదిని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ డా. జానకి షర్మిల
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఎస్పీ డా.జానకి షర్మిల సందర్శించారు. ఆలయ సమీపంలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్నాన ఘట్టం పరిస్థితిని పరిశీలించారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పూర్తిగా నిండిపోయిందని, భక్తులను లోనికి అనుమతించవద్దని సూచించారు. సోమవారం మూల నక్షత్రం ఉండడంతో బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ అవినీష్ కుమార్, ముథోల్ సీఐ మల్లేష్, బాసర ఎస్సై బి.శ్రీనివాస్ ఉన్నారు.

