ఘనంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రులు
*పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయంలో నాలుగో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్దమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కోనేరు పోతన్న మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు అన్నదానాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సట్ల కిష్టన్న, బీజేపీ నాయకులు బాలాపురం లింగం, సందుల రమేష్, గన్నారం సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు యువకులు, పెద్దలు తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

