అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నర్సూరి నరేష్ దంపతులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసర సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త నర్సూరి నరేష్, దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద తన తల్లిదండ్రుల చేతుల మీదుగా భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్టు నర్సూరి నరేష్ తెలిపారు.

