Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

యువతలో క్రమశిక్షణ పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ధ్యేయం

*తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్

చిత్రం న్యూస్, ముథోల్: యువతలో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించడమే సమతా సైనిక్ దళ్ ద్యేయమని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ముథోల్ లోని నాగార్జున నగర్ బుద్ధ విహార్ ఆవరణలో సమతా సైనిక్ దళ్ నిర్మల్ జిల్లా మొదటి వార్షికోత్సవ వేడుకలు, భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర  ఇంఛార్జి  కస్తూరె సంజయ్ బోధి వర్ధంతిని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఉన్నతమైన లక్ష్యాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో యువత పయనించే విధంగా చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. బహుజనులపై జరిగే అన్యాయాలపై స్పందించి వారి హక్కుల సాధనలో భాగస్వాములు అవుతామన్నారు. యువతలో ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. సమతా సైనిక్ దళ్ లో చేరడానికి యువత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాగ్మారే నారాయణ, సంస్కార్ విభాగము తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్బారావు వాగ్మారె, రాష్ట్ర కమిటీ సభ్యులు సవితా బాయ్ టోక్రే, సంజయ్ క్షిర్సాగర్, జిల్లా కోశాధికారి రామచందర్ జంగ్మే, జిల్లా పర్యటక విభాగం ప్రధాన కార్యదర్శి పండిత్ వాగ్మారే, జిల్లా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షులు అశోక్ బన్సోడె, జిల్లా కార్యవర్గ సభ్యులు శృంగారె గంగాధర్, రాందాస్ వాగ్మారె,  ముథోల్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ వాగారే, లోకేశ్వరం మండల అధ్యక్షులు దిలీప్ కదమ్, తానూర్ మండల కార్యధ్యక్షులు నాగోరావ్ లోకండే, సమతా సైనిక్ దళ్ సైనికులు, బౌద్ధ ఉపాసకులు, ఉపాసికులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments