Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం 

YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల దేగాం గ్రామానికి చెందిన యోగ శిక్షకురాలు వెంకటోళ్ల స్రవంతిని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సన్మానించారు. మూడు సంవత్సరాల నుండి యోగ శిక్షకురాలు వివిధ యోగ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో,తన యొక్క ప్రతిభను కనబరిచారు.  రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ లో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో నిర్మల్ జిల్లా నుండి పాల్గొని నాలుగో స్థానంలో నిలిచారు. శుక్రవారం నిర్వహించిన నిర్మల్ జిల్లాస్థాయి యోగ పోటీలు తానూర్ మండల కేంద్రంలోని ఎమ్ ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. జిల్లా స్థాయి నాలుగో యోగ మహిళల సీనియర్ స్థాయిలో కేటగిరి (డీ) లో ప్రథమ స్థానంలో  నిలిచిన ఆమెను యోగ అసోసియేషన్ఆ ధ్వర్యంలో వెంకటొళ్ళ స్రవంతికి మెమొంటో , షీల్డ్ తో బహుకరించారు.  మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి నివాసంలో వీడీసి ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు రోజూ వారీ జీవన విధానంలో ఉదయపు నడక, యోగ ఆసనాలు చేయడంతో మనిషి శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ టేకుల లింగన్న, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి,  మాజీ మాజీ వార్డ్ మెంబర్ అప్పం గోవర్ధన్ రెడ్డి, నాయకులు అయిండ్ల మోహన్ రెడ్డి, గడ్డిగరి చందూ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments