సబ్ యూనిట్ అధికారిగా రవీందర్ బాధ్యతలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ అధికారిగా పవార్ రవీందర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సొనాల, బజార్ హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, నేరడిగొండ మండలాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు పవార్ రవీందర్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని అదిలాబాద్ జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ కు వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సుభాష్, రాథోడ్ కైలాష్, సుధారాణి, వసంత్ ,ఏఎన్ఎం, ఆశ, కార్యకర్త తదితరులు ఉన్నారు.

