SCHOOL: పాఠశాలకు శుద్ధ జల యంత్రం విరాళం
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.25 వేల విలువచేసే శుద్ధజల యంత్రాన్ని దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ పంచగుడి మహేష్ ఆధ్వర్యంలో పాఠశాలకు అందజేశారు. శుద్ధ జల యంత్రాన్ని బిగింపజేసి హెచ్ఎం నరేందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంతుందన్నారు. వంద లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ శుద్ధ జల యంత్రాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని దివ్యాంగు శక్తి కమిటీ బృందం సూచించారు. ఈ సందర్భంగా దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ కమిటీ బృందానికి పాఠశాల హెచ్ఎం నరేందర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని హెచ్ఎం కోరారు.

