HEALTH CAMP: గుబ్బ తండాలో వైద్య శిబిరం
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని గుబ్బ గ్రామంలో శనివారం మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరమును గుర్తించి మందులు పంపిణీ చేశారు. రక్తపోటు, మధుమేహం వ్యాధులను గుర్తించి మందులు అందజేశారు. ఇంటి చుట్టూ నీళ్లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిలలో దోమల లార్వాలను గుర్తించి పారబోశారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పవార్ రవీందర్, రాథోడ్ కైలాష్, రాజ్ కిరణ్, సుభాష్, వసంత్ సుభాష్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

