Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర  ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో 2025 పోస్టర్లను బోథ్ ఎస్ఐ శ్రీసాయి శనివారం  ఆవిష్కరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఎక్స్పోలో  ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బోథ్ ఎస్ఐ శ్రీసాయి మాట్లాడుతూ.. ఫొటోగ్రాఫర్లు వైవిద్యమైన ఫొటోలు తీస్తూ.. ప్రస్తుతం నడుస్తున్న (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందిపుచ్చుకొని కస్టమర్లను సంతృప్తి పరచాలన్నారు. ఇలాంటి ఫొటో ఎక్స్పోలు వృత్తి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్,  సొనాల మండల గౌరవ అధ్యక్షులు జూకంటి సదాశివ్, అధ్యక్షులు బుస లక్ష్మణ్,  ఉపాధ్యక్షులు దండారి రంజిత్, ప్రధాన కార్యదర్శి ముప్కాల రాజేశ్వర్, కోశాధికారి కాడేరుగుల గణేష్ , యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments