ADILABAD: బోథ్ CHC ఆసుపత్రిలో నిలిచిన ఓపీ సేవలు
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ CHC ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమపై దాడి జరిగిందంటూ ఆసుపత్రి సిబ్బంది విధులుబహిష్కరించి నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరిడెంట్ డా.రవి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగిన ఓ మహిళను బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు రెఫర్ చేశారు. అయితే రిమ్స్ కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని, ఇక్కడే వైద్యం అందించాలని రోగి బంధువులు గొడవ చేసి వైద్య సిబ్బంది పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. రాత్రుల్లో విధులు చేసే తమకు రక్షణ లేకుండా పోయిందని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

