-Advertisement-

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు

ఉపాధ్యాయుల చేతుల్లోనే భవిష్యత్తు

చిత్రం న్యూస్, భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామ యువకులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన గణపతి పీఎస్ హెచ్ ఎంగా  పదోన్నతి పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా దివ్యాంగు శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు పంచగుడి మహేష్ హాజరయ్యారు. ఉపాధ్యాయులను సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నదని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది గురువులేనన్నారు. గురువులు ప్రత్యక్ష దైవంతో సమానులని, వారు చూపే మార్గంలో నడిచి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి లక్ష్యం పట్ల అవగాహనను కలిగించి వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పీఎస్ హెచ్ఎం, ఎంపీపీఎస్ గర్ల్స్ ముథోల్ ప్రధానోపాధ్యాయుడు గణపతి మాట్లాడుతూ… పూర్వ వాలేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన నన్ను గుర్తుపెట్టుకుని యువకులు ఆహ్వానించడం ఎంతో సంతోషమన్నారు. సన్మానం కార్యక్రమం చేసిన యువకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడానికి మనసుతో సంబంధం లేదని ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చని గుర్తు చేశారు. యువకులకు, వారి తల్లిదండ్రులను వయోజన విద్యని ప్రోత్సహించాలని చెప్పారు. ఉపాధ్యాయులు సోనియా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు, గ్రామస్థుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన గణపతినీ ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఉపన్యాసాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రతి ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుడేనని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు బహుమతి అందజేశారు. యువకులు లక్ష్మణ్, ఆనంద్, రవి, సాయినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయ, విద్యారంగం వ్యవస్థను ప్రభుత్వాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు పాఠశాలతో పాటు క్రమశిక్షణ, విలువలు, సంప్రదాయాలు, దేశభక్తి జాతీయ భావాలు నేర్పించాలని సూచించారు. అంతకుముందు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి 84 విద్యార్థులకు గ్రామ యువకులు వడ్డించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పోతన్న, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments