భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి
*పరుపుల పల్లె వినాయకుని దర్శనం
“యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
_మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని పరుపులపల్లె గ్రామంలోని వినాయకుని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో రూ.15 లక్షలతో రోడ్డు, హైమాస్డ్ లైట్ ఏర్పాటు, సౌండ్ బాక్సులు గ్రామస్తుల కోరిక మేరకు దీపావళి కానుకగా అందజేస్తానన్నారు. యువతీ, యువకులు చదువుపై శ్రద్ధ వహించాలని, చదువే ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, యువ నాయకులు S.K ఆసిఫ్ , జాదవ్ కృష్ణ, తుల హరీష్, ప్రదీప్ నాయక్, రాథోడ్ విక్రమ్, పరుపులపల్లె గ్రామ పటేల్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.




