ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్
మాజీ సీఎం వైఎస్ఆర్ సేవలు ఎన్నటికీ మరువలేనివి – బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు అయన చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ఆయన పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ సరఫరా, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు వంటి పథకాలు ఆనాడు సమాజంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఒక బలమైన పునాది వేశాయని గుర్తుచేశారు. రైతు కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ పథకాలు ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు, సామాజిక న్యాయం పట్ల ఆయన దృష్టికి నిదర్శనమన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మనం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, NSUI మండల అధ్యక్షులు మర్సకోళ్ల గౌతం, sk అలీమ్, సమీ ఉల్లా ఖాన్, md ఆఫ్సర్, మోర్తుజా, md వసీం, రెండ్ల రాజన్న, దేవాజీ, రహీమ్, sk అజిజ్, సంటెన్న , ప్రశాంత్, అక్షయ్, దినేష్, ప్రేమ్, దినేష్, అఫ్సర్ ఖాన్, అజిమ్ ఖాన్, రాకేష్, తరుణ్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.