EX CM KCR- మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకే సీబీఐ ఎంక్వైరీ
*కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల పొలిటికల్ డ్రామా
చిత్రం న్యూస్, భోరజ్ పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర రిపోర్ట్, మా సిల్వర్ జూబ్లీ అప్పుడు ఫైనల్ రిపోర్ట్, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి ఘోష్ రిపోర్ట్..ఇదంతా పొలిటికల్ డ్రామా అని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు కలిసి NDSA రావడం నుంచి ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్ల రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సీబీఐ ఎంక్వైరీ వరకు ఇవన్నీ కూడా కేసీఆర్, కాళేశ్వరం, బీఆర్ఎస్ ను బద్నామ్ చేసే కుట్ర అని తేలిపోయిందన్నారు. సీబీఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
సీబీఐ, ఈడీలతో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే సిబీఐ, ఈడీ లతో దాడులు చేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నారని విమర్శించారు. సీబీఐని వాడుకొని కేసీఆర్ ను బద్నాం చేసి కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చూపించే ప్రయత్నం చేసున్నారని, ఆంధ్రా, బనకచర్లకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి పన్నిన పన్నాగం అని తేలిపోయిందన్నారు. అపర భగీరథుడు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరంపై విష ప్రచారం చేసి..ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర అని అన్నారు. మీరెన్ని కక్ష రాజకీయాలు చేసినా ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు