బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారo రాత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.