ఓటర్ లిస్టుపై అభ్యంతరాల స్వీకరణ
చిత్రం న్యూస్, నేరడిగొండ: గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో అభ్యంతరాలు, అనుమానాల నివృత్తి కోసం ఈరోజు నేరడిగొండ మండల పరిషత్తు అభివృద్ది అధికారి కార్యాలయంలో శనివారం అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నేరడిగొండ మండలంలోని పోలింగ్ కేంద్రాల జాబితాను పరిశీలించి, పలు అభ్యంతరాలు, సూచనలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శేఖర్, ఎంపీవో లక్ష్మణ్, మండల పార్టీల నాయకులు, సబ్లె సంతోష్. ఆకుల రాజశేఖర్. ఆడే వసంత్. రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.