బేల మండల విద్యాధికారిగా మహాలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల విద్యాధికారి (FAC) గా మహాలక్ష్మి నియమితులయ్యారు. సిర్సన్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమెను meo గా నియమిస్తూ ఆర్జేడీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఆమె ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించారు.. ఆమె మాట్లాడుతూ.. మండలంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అందరి సహకారంతో మండలాన్ని విద్యాపరంగా అగ్రభాగంలో ఉంచుతామని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నితిన్, దేవరావు, నాయకులు రామచందర్ అరుణ, ఎమ్మార్సీ సిబ్బంది ఆమెను సన్మానించి అభినందనలు తెలిపారు.