మావలలో ప్రతిష్టించిన వినాయకుడికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, మావల: తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం మావల లోని ఈశ్వర్ గణేష్ మండలి వారు ప్రతిష్టించిన గణనాథుడికి శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి ఇరువురు దంపతులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, భారీ గరిక మాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు గణేష్ మండలి నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.