MUDHOLE MLA RAMARAO PATEL-భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇంటి బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వాగుల పరివాహక ప్రాంత ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ సూచించారు.