AADE GAJENDER- బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ
చిత్రం న్యూస్, నేరడిగొండ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జైపాల్ రెడ్డి తండ్రి వెల్దండ రామచంద్రా రెడ్డి ఇటీవల పరమపదించారు. బుధవారం ఉదయం టీపీసీసీ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ నేరడిగొండ నుండి బయలుదేరి జైపాల్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామచంద్రా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.