BOATH MLA –సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన సోయం జంగు బాయికి మంజూరు అయిన రూ.21 వేలు, బోథ్ మండల కేంద్రానికి చెందిన తోట లక్ష్మికి మంజూరు అయిన రూ.12 వేలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. కార్యక్రమంలో బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, నేరడిగొండ మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకుడు ఆడే రవీందర్ ఉన్నారు.