ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్ని
నూతన కార్యవర్గంతో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా
చిత్రం న్యూస్,ఆదిలాబాద్ : సంఘటిత శక్తి తోనే అభివృద్ధి సాధ్య పడుతుందని జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సంఘ అభివృధ్ధితో పాటు సమజాభివృద్ధికి తోడ్పాటునందించాలని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక మంగళవారం ప్రశాంతంగా సాగింది. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఉదయం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులకు నామినేషన్లను స్వీకరించగా…అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అన్నొజుల శ్రీనివాస్, అవునూరి దత్తాత్రి, ఉపాధ్యక్షులుగా కిరణ్, కోశాధికారిగా అవునూరి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఏ.నవీన్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా సంజయ్ వ్యవహరించారు. ఈమేరకు శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ..ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
నూతన అధ్యక్షులు అన్నొజుల శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుకు కృషి చేస్తామని తెలిపారు.