Accridation G.O lo marpulu cheyali -అక్రిడిటేషన్ జీఓ లో మార్పులు చేయాలి
ఐ అండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతి
చిత్రం న్యూస్, విజయవాడ:
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ జీఓలో మార్పులు చేయాలని కోరుతూ ఐఅండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. విజయవాడలోని బస్సు భవన్ లో సమాచార శాఖ ఆడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, జేడీ కిరణ్ కుమార్ లకు ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ జారీ చేసే రాష్ట్ర, జిల్లా కమిటీల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. చిన్న పత్రికల నుంచి ప్రాతినిధ్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 2016 నుంచి పత్రికల ఎంప్యానల్ పక్రియను నిలిపివేశారని, ఆ సమస్యను పరిష్కారం చేస్తే ఆ పత్రికల్లో పని చేసే వారికీ కూడా అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ జారీ చేసే విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్ జారీలో విద్యార్హత విధానం తీసివేసి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.