ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
చిత్రం న్యూస్, భైంసా:
మండలకేంద్రంలో గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా కళాశాలలో వివిధ రకాలకు చెందిన దాదాపు 100 మొక్కలను అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కరోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడం మూలంగా వర్షం కురవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్క విద్యార్థి విధిగా భావించాలని, మొక్కలు ప్రాణాధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, డాక్టర్ పి.గంగారెడ్డి, యూ.రవి కుమార్,డాక్టర్ శంకర్, డాక్టర్ భీమారావు , డాక్టర్ సంతోష్, దివ్య, అక్తర్, సాయినాథ్, రాజయ్య, రామ్మోహన్, సురేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.