Matti ganesh vigrahaala pampinee- మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ
ఉచితంగా పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలో, అంబేద్కర్ చౌక్ లో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. మట్టి ప్రతిమలనే వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ ఖత్రి, గేడం మాధవ్, మామిడి మల్లారెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.