Patashaalalo Vinayaka chavithi vedukalu- పాఠశాలలో వినాయక చవితి వేడుకలు
మట్టి విగ్రహాలను తయారు చేసిన పాఠశాల విద్యార్థులు
చిత్రం న్యూస్,భైంసా:
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో వినాయకుడి ప్రతిమలను తయారు చేశారు. పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికే విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించామని స్కూల్ హెచ్ఎం రాధిక తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని హెచ్ఎం రాధిక, విద్యార్థులకు సూచించారు.