ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి
*కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగా పరీవాహక ప్రాంతాల్లో అధికంగా సోయా, పత్తి, కంది పంటలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. వరద ముంపుకు గురైన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం అందజేయాలని కోరామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిడం రాకేష్, పొచ్చన్న, సూర్యరెడ్డి, రమేష్ అశోక్, భోగి ఊశన్న తదితరులు ఉన్నారు.