విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూత
చిత్రం న్యూస్, బోథ్ : విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మోడల్ స్కూల్ విద్యార్థులు. ఇక్కడ గంటల ప్రాతిపదికన పనిచేస్తూ ఇటీవల మరణించిన ఎకనామిక్స్ ఉపాధ్యాయుడు అశోక్ కుటుంబానికి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు రూ.93,460 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మొత్తాన్ని అశోక్ భార్య, పిల్లలకు ప్రిన్సిపాల్ Dr.అనురాధ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.