శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా.బోథ్ పట్టణం కేంద్రం లోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయం లో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు కలశం పెట్టి అఖండ దీపం వెలిగించారు. నిత్యం భోజన కార్యక్రమం నిర్వహించారు. రోజు వేముల చంద్రమోహన్ గారితో ప్రవచనాలు భక్తులుకి వినిపించారు. నిత్యం భజనలు చేసిన భక్తులకు, ప్రవచనం చేసిన చంద్రమోహన్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం చంద్ర మోహన ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆలయంలో గల శివ విగ్రహానికి సేరె లక్ష్మీ ఆధ్వర్యం లో అన్న పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పట్టణ పద్మశాలి గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్, అధ్యక్షుడు మెరుగు భోజన్న, ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్, భజన భక్తులు బారే హితిష్, బారే నారాయణ, దాసరి గంగయ్య, బింగి పురుషోత్తం, తాటికొండ రాజేశ్వర్, గొర్ల ప్రభాకర్, బొడ్డు సుశీల, సేరె లక్ష్మీ, బోనగిరి చంద్రకళ, బారె పద్మ, సోయం రాధ, జక్కుల లక్ష్మీ , పోసాని, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.