ఎమ్మెల్యే రామారావు పటేల్ ను సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన వాలేగాం గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ని కలిసి శాలువా కప్పి పూలబొకేతో సభ్యులు సన్మానం చేశారు. అనంతరం గ్రామలోని హనుమాన్ మందిర్, పాఠశాల ప్రహరీ గోడ తదితర సమస్యలను చెప్పారు. దానికి ఎమ్మెల్యే సమస్యల పైన సానుకూలంగా స్పదించినారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పుండలిక్ పటేల్,క్యాషియర్ మహేష్ పటేల్,బాలు పటేల్, బీజేవైఎం భైంసా మండల ఉపాధ్యక్షులు,ఎస్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, శీను, పోతన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.