సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితమే శ్రీ బాల గంగాధర్ తిలక్ హిందూ ఐక్యతకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే యువత పెద్ద ఎత్తున సంఘటితమై స్వాతంత్ర్య పోరాటంలో సైతం భాగస్వామ్యులయ్యారని తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడంతో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారన్నారు. ఆయన స్ఫూర్తితో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఐకమత్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడుతూ, గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని కొనియాడారు.
ముఖ్యంగా వినాయక చవితి, కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయం అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని తమ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమితి ప్రతినిధులందరిని సన్మానించారు. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు జిల్లా కేంద్రంలో ఈ నెల 26,27 తేదీలలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు బండారి వామన్, అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ప్రధాన కార్యదర్శులు గేడం మాధవ్, పడకంటి సూర్యకాంత్, కార్య నిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, లోపు శ్రీనివాస్, మహిపాల్, సంజీవ్, రాజు, మేకల అశోక్, వెనుగంటి ప్రకాష్, సంతోష్ అగర్వాల్, సురేష్ పోడ్వాల్, పూసం ఆనందరావు, మహిళా అధ్యక్షురాలు చౌహన్ శశికళ, ప్రధాన కార్యదర్శి మాలతి, తదితరులు పాల్గొన్నారు.