నేరడిగొండలో ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నేరడిగొండ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో అడే గజేందర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఆయనతో కేక్ కట్ చేయించారు. కార్యకర్తలు శాలువా, పూలమాలతో సన్మానించి తమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనం మెచ్చిన జననేత, పేద ప్రజల పెన్నిధి, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్న అని కొనియాడారు. తమ జన్మదిన వేడుకలకు హాజరైన కార్యకర్తలకు గజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజేందర్ గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ ఇమామ్ ,నారాయణ గౌడ్, అగు రమేష్, మురళిగౌడ్, పర్ల వంశీ, రాజు గౌడ్, కళ్లెం భోజన్న ,వడ్ల నారాయణ,లక్ష్మన్న, కంచం లక్ష్మణ్, దత్తు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.