బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నేరడిగొండ లోని లక్ష్మి గార్డెన్ లో జరిగిన జన్మదిన వేడుకల్లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆడే గజేందర్
ను శాలువాతో సన్మానించారు. అనంతరం కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, రెండ్ల రాజన్న, ఎస్ కే అలీమ్, దినేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.