ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
చిత్రం న్యూస్, భైంసా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తౌసిఫ్ ఆధ్వర్యంలో వాలేగాం లో వైద్య శిబిరం నిర్వహించారు. 69 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ తౌసిఫ్ మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. వైద్య శిబిరములలో అసంక్రిమిత వ్యాధులు అనగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీఎచ్ఓ వంశీ, డాక్టర్ హెచ్ ఈవో అబ్దుల్ సలీమ్, డాక్టర్ విజయ్ కుమార్,ఏఎన్ఎంలు లక్ష్మి,మంజుల, గ్రామ కార్యదర్శి పోతన్న, స్వయం సహకార సీసీ లక్ష్మణ్,గ్రామ సమైక్య విఓఏ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, ప్రజలు తదితరులు ఉన్నారు.
-Advertisement-