ఇస్పూర్ లో భూమిపూజ చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతరలో భాగంగా నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ గ్రామంలో నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ భవనం , క్యాటిల్ షెడ్ నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గ్రామస్తులు సన్మానించారు. 100 రోజుల పని పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వాంకిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని దీనిని మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేశారని అన్నారు. పనుల జాతరలో పాత పనుల ప్రారంభోత్సవాలే ఉన్నాయని కొత్త పనులు మంజూరు చేసి కార్యక్రమం పెడితే బాగుండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు శివారెడ్డి, రమేష్, నానక్ సింగ్, రాజు, సవాయిరాం, అనిల్ యాదవ్, రాథోడ్ సురేందర్, రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గులాబ్, భారత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.