సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం అందజేశారు. సొనాల మండలంలోని ఫుల్సింగ్ నాయక్ తాండ గ్రామానికి చెందిన కచివార్ శశికళకు మంజూరు అయిన రూ.20,500 ల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. పేదవారు ఎవరైనా హాస్పిటల్ బిల్లు తీసుకుని తన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానంద్, రాథోడ్ సజన్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, సకారం, వసంత్ తదితరులు ఉన్నారు.