యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని గుత్పాల గ్రామంలో యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం గురువారం ప్రారంభించారు. టైలరింగ్, శిక్షణ అనంతరం మహిళలకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం అమోదం పొందిన సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని ఇంఛార్జి సంధ్యారాణి తెలిపారు. 30% సబ్సిడీ పైన కుట్టు మిషన్ లు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీచర్ అర్జున్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, టైలరింగ్ టీచర్ షాహిదా, గ్రామ మహిళలు పాల్గొన్నారు.