కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. గురువారం విద్యార్థులకు చేయూత కార్యక్రమం లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల వాడ కాలనీ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేసి విద్యార్థుల తల్లితండ్రులను సన్మానించారు. అంతకు ముందు పాఠశాలకు విచ్చేసిన మౌనిష్ రెడ్డి కి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని, ఉపాధ్యాయులు సుష్మరాణి, గీత, మాజీ సర్పంచ్ రాజన్న, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.