ఘనంగా వినాయక ఆలయం 8వ వార్షికోత్సవంఆ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ రేణుకా అపార్టుమెంటు లోని వినాయక ఆలయం 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ, హోమాది కార్యక్రమాలను చేపట్టారు. లోక ప్రవీణ్ రెడ్డి దంపతులతో పాటు అపార్టుమెంటు లో నివసించేవారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆలయ వార్షికోత్సవంలో వినోద్, మేయూర్, సందీప్ రెడ్డి, సునీల్, అనిల్ రావు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.