ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
చిత్రం న్యూస్, బోథ్ : ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ శ్రీ సాయి తో కలిసి నిందితుడి వివరాలు సోమవారం వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సంపత్ నాయక్ తండా, టివిటి, పార్ది (బి) గ్రామాల్లోని యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి రాథోడ్ సంజువ్ దగ్గర నుండి 1,50,000 వేలు, రాథోడ్ బాపురావు నుండి 1,20,000 వేలు, మచ్చేందర్, జంగు, గణేష్, బాలు, అను నలుగురు వ్యక్తుల నుంచి 70 వేలు తీసుకున్నాడు. ఇలా మొత్తం కలిపి 5,50,000 వేలు తీసుకొని వీరిని మోసం చేశాడన్నాడు. వీరంతా కలిసి మావిడాల సతీష్ పైన ఫిర్యాదు చేయడంతో బోథ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. మావిడాల సతీష్ ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.