కుండపోత వర్షం..గ్రామాలు అతలాకుతలం
*జలమయమైన రోడ్లు, నీట మునిగిన ఇళ్ళు, పంటలు, గ్రామాలకు నిలిచిన రాకపోకలు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి జైనథ్, భోరజ్ మండలాల్లోని గ్రామాలు అతలాకుతంగా మారాయి. జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలోని పలు ఇళ్ళు, పంట చేలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చెందిన కుంచపు గణేష్, ఓల్లేపు మారుతి, మంజుల రమేష్, భూతం భీమయ్య ఇళ్ళ లో వరదనీరు చేరింది. ఇంట్లోని వస్తువులు, నిత్యవసర సరకులు తడిసిపోయాయి. ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వాపోయాయి.
భారీ వర్షంతో పత్తి, సోయా పంటలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.