-Advertisement-

దేశ రక్షణలో ఆర్మీ జవాన్ల సేవలు అభినందనీయం

విశ్రాంత ఆర్మీ జవాన్ శంకర్ దాస్ ను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: దేశ రక్షణలో ఆర్మీ జవాన్ల సేవలు అభినందనీయమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని సైనిక సంక్షేమ కార్యాలయంలో విశ్రాంత ఆర్మీ జవాన్లను శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. దేశ రక్షణ కోసం సరిహద్దులు, కుటుంబాలను వదిలి కాపలాగా ఉన్న సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరిస్తూ వారిని గౌరవించాలని పేర్కొన్నారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సైనికులు శత్రువులతో పోరాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు  శంకర్ దాస్, ఆర్. దేవన్న, వామనరెడ్డి, ఎల్. వి రావు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments