అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్
చిత్రం న్యూస్, నిర్మల్ :ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితులకు సమస్య తెలుసుకొని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. వనమహోత్సవంలో నాటిన మొక్కల వివరాలు వెంటనే అప్డేట్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫేసియల్ రికగ్నైజింగ్ హాజరు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.