ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో స్వర్ణకారులు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు స్వర్ణకారుల కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయ వృత్తితో జీవితం ఆరంభించి చిన్ననాటి నుంచి ఉద్యమ భావశీలి పొందిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఇచ్చోడ మండల కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలి ఉద్యమాలలో సిద్ధాంతకర్తగా ఉండి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చి తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ వివాహాన్ని చేసుకోకుండా ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కు హర్ష నివాళులును ప్రకటించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారులందరూ అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు అందరూ ముందుకెళ్లి ఉద్యమాలలో ప్రజలకు సేవ చేస్తూ ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం సభ్యులు సుదర్శన్, గణేష్, మారుతి రావు, గోపి, మల్లేష్, మహేందర్, సురేందర్ పాల్గొన్నారు.
-Advertisement-

