మహా గర్జన సభను విజయవంతం చేయండి
*పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
చిత్రం న్యూస్, భైంసా: ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభకు గ్రామంలో ఉన్న పెన్షన్ దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, ఆర్మూర్ లో జరిగిన సభలో వికలాంగుల పెన్షన్ రూ.6 వేలు, వృద్దుల, వితంతువుల చేయూత పెన్షన్ రూ.4 వేలు, తీవ్రమైన వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు పెంచాలని పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధుల పింఛన్‌ను పెంచకపోతే 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభను ఉద్ధృతం చేస్తామన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం వాలేగాం గ్రామ కమిటీ అధ్యక్షులు కత్తి పోచారం, ఉపాధ్యక్షులు కదం పోతన్న, ప్రధాన కార్యదర్శి బీరోల్ల భోజన్న, కార్యదర్శి గంటల్కర్ సాయన్న పాల్గొని మంద కృష్ణ మాదిగని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు.

