స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ
*అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు
*బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తండ్రి
*స్కూటీ డిక్కీలో పెట్టుకొని ఇంటికి పయనం
*మధ్యలో భోజనం కోసం స్కూటీ నిలిపివేత
*హోటల్ వెళ్లి వచ్చే లోప డబ్బులు చోరీ
*బాధితుడు ముథోల్ మండలం ఎడ్ బిడ్ నివాసి
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం పట్టపగలు చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉంటున్న తన కూతురు పంపిన డబ్బులను బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం వేళలో ఎడ్ బిడ్ నుంచి స్కూటీపై బైంసాకు వచ్చిన ఆనంద్ స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం వాటిని స్కూటీ డిక్కిలో పెట్టుకొని ఇంటికి బయలు దేరారు. ఇదే సమయంలో ఆకలి వేయడంతో పట్టణ సరిహద్దులోనున్న ఓ బార్ వద్ద తన స్కూటీని నిలిపి భోజనం కోసం లోనికి వెళ్ళాడు. ఇదే సమయంలో ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై బార్ వద్దకు చేరుకున్నారు. ఇందులో నుంచి ఒకరు స్కూటీ వద్దకు చేరుకొని డిక్కి తెరిచి అందులో నుంచి డబ్బులు ఆపహరించుకపోయాడు. భోజనం ముగించుకొని తిరిగి తన వాహనం వద్దకు రాగా స్కూటీ డిక్కీ తెరిచిఉండగా చూసి కంగారు చెందిన ఆనంద్ పూర్తిగా డిక్కీని తెరిచి చూడగా అందులో బ్యాంక్ నుంచి డ్రా చేసి పెట్టిన డబ్బులు కనిపించకుండా పోయాయి. డబ్బులు చోరికి గురయినట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే బార్ నిర్వాహకులకు సంబంధిత చోరి విషయాన్ని వివరించారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి సంబంధిత విషయాన్ని వివరించారు. టౌన్ సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు చోరి ఘటన చేదించేందుకు గాను సీసీ పుటేజీ పరిశీలించారు.అయితే దుండగులు బాసర మార్గం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యింది.

