తిరుపతిలో కుటుంబ సభ్యులతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఏడుకొండలవాడిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

