కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్తున్న వీహెచ్ పీఎస్ సభ్యులు
చిత్రం న్యూస్, బోథ్: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో ఆదిలాబాద్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే దీక్షకు బోథ్ నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘం సభ్యులు తరలివెళ్లారు. అనంతరం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ మాట్లాడుతూ.. వికలాంగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రూ.4 వేల పెన్షన్ రూ.6 వేలు చేయాలని, వికలాంగులకు పూర్తిస్థాయిలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. వికలాంగులకు వ్యాపార నిమిత్తం సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని, వికలాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే వికలాంగులకు తగిన న్యాయం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ తో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు మోతే రాజేశ్వర్, కార్యదర్శి భోగ శంకర్ ఉపాధ్యక్షులు రమేష్ , సంఘ సభ్యులు ఆసిఫ్, మాల్వే రామచందర్, అనిల్ అన్నారు.

