కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అందరివాడుగా పేదల పెన్నిధిగా పేరు గడించిన వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి సుదర్శన్ రెడ్డి కటౌట్ ప్రక్కన ఆయన 77వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకంక్షలు తెలిపారు. వైఎస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞం పథకం సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆదిలాబాద్ జిల్లాకు ప్రాజెక్టులు తెచ్చి ఇక్కడి రైతాంగానికి ఎంతో మేలు చేసారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి , రావుల సోమన్న, దొగ్గలి రాజేశ్వర్ , దాసరి ఆశన్న, ఎంఏ షకీల్ , రఫీఖ్, అజయ్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.